భారతదేశంలోనే హైదరాబాద్ ఒక డిఫెన్స్ హబ్‌గా మారిందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనుబంధ సంస్థ అయిన నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ యొక్క భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు మంత్రి కేటీ రామారావు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..టాటా గ్రూప్‌కు హైదరాబాద్ తో మంచి అనుబంధం ఉందన్నారు. హైదరాబాదులో అనేక కంపెనీలు నెలకొల్పి అద్భుతమైన గ్రోత్ తో ముందుకు వెళ్తున్నాయని చెప్పారు.
హైదరాబాద్‌లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనుబంధ సంస్థ అయిన నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాదులో డిఆర్డిఎల్ తో పాటు అనేక డిఫెన్స్ సంస్థలు ఇక్కడి నుంచి పని చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాదు డిఫెన్స్ రంగానికి డెస్టినేషన్ గా మారిందని…డిఫెన్స్ అండ్ రంగానికి సంబంధించి అనేక MSME పరిశ్రమలో హైదరాబాదులో ఏర్పాటయ్యాయని చెప్పారు.