మార్పు బాగుందా?: కేటీఆర్

19
- Advertisement -

మార్పు బాగుందా? చెప్పాలని ఖమ్మం ప్రజలను కోరారు మాజీ మంత్రి కేటీఆర్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో డిసీఎంఎస్ మాజీ చైర్మన్ స్వర్గీయ రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు కేటీఆర్. ఈ సందర్భంగా మిట్టపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన కేటీఆర్..కీ. శే రాయల శేషగిరిరావు విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అన్నారు.

ధాన్యం కొనుగోలు జరగడం లేదు.. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు, 17 నెలల్లో జిల్లాకు ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలి అన్నారు. కేసీఆర్ ప్రజల కోసం సీతారామా ప్రాజెక్ట్ తెస్తే ఆ నీళ్ళు నెత్తిన జల్లుకునారు కానీ ప్రజలకు ఏమి చేయలేదు… ఉప ముఖ్యమంత్రి భట్టి అఫిడవిట్, నోట్‌లు అబద్ధపు హామీలు అన్ని ఇచ్చాడు అన్నారు. తప్పకుండా ఇచ్చిన హామీని 100 రోజుల్లో చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అన్నారు.

కేసీఆర్ కిట్ అనే పథకం అద్భుతమైన పథకం. కాంగ్రెస్ వచ్చాక ఆ పథకం ఎత్తేశారు.. రైతుబంధు గురించి ఆనాడు రెండు పంటలకు ఇస్తావా? అని అడిగిన రేవంత్ నేడు ఒక్క పంటకి కూడా ఇవ్వడం లేదు అన్నారు. రైతు రుణమాఫీ లేదు, షాది ముబారక్ లేదు… వాళ్ళు చెప్పిన ఏ హామీ అయినా నెరవేర్చరా?,మార్పు బాగుందా? మార్పు కావాలని జిల్లా మొత్తం కాంగ్రెస్‌కి ఓటేశారు.. కాంగ్రెస్‌ను నమ్మి మంచి మంచి నాయకులను ఓడగొట్టారు అన్నారు.

10 ఏళ్ల పాలన చేసిన కేసీఆర్‌ను కాదని కాంగ్రెస్ విసిరిన ఆనందమైన వలలో చిక్కుకున్నారు… 6 గ్యారెంటీలు కాకుండా 420 హామీలు ఇచ్చారు అన్నారు. నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూసా, ఎవరూ కూడా రేవంత్ రెడ్డి లాగ దివాళాకోరు మాటలు మాట్లాడలేదు… ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారంటున్నా రేవంత్.. దొంగను దొంగలాగే చూస్తారు కదా చెప్పాలన్నారు.

Also Read:ఇండియన్ ఆర్మీకి వందనం:రాజమౌళి

- Advertisement -