పెట్టబడులకు స్వర్గధామం తెలంగాణ: కేటీఆర్

441
ktr hyderabad
- Advertisement -

తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం అన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లో ఇండియా -థాయ్ లాండ్ మ్యాచింగ్ అండ్ నెట్ వర్క్ సమావేశం జరుగగా ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్,థాయ్ ఉప ప్రధాని జురీన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…థాయ్‌లాండ్‌కు భారత్‌కు చాలా దగ్గర సంబంధాలున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దేశ వృద్ధిరేటును మించి అభివృద్ధి చెందుతోందన్నారు. వాణిజ్యరంగం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపార అవకాశాలున్నాయని…ఇక్కడ ఫర్నిచర్ పార్క్‌ ఏర్పాటు చేయాలని థాయ్ లాండ్ ప్రభుత్వాన్ని కోరారు. బ్యాంకాక్- హైదరాబాద్‌కు ఎయిర్‌లైన్స్ సర్వీసులు పెంచి పర్యాటకంగానూ వృద్ధి చెందొచ్చన్నారు.

కృష్ణపట్నం పోర్టు ద్వారా తెలంగాణకు రవాణా చేసుకోవచ్చన్నారు. ఎన్నో ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయని చెప్పిన కేటీఆర్ ..ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్ ఉందని…. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా డబుల్ బెడ్‌ రూం ఇండ్లు ఇస్తుందన్నారు.

- Advertisement -