టీఎస్ ఐపాస్ లాంటి విప్లవాత్మకమైన విధానాలతో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని తెలిపారు మంత్రి కేటీఆర్. 1992,93,94 సంవత్సరాల ఐఎఫ్ఎస్ సీనియర్ అధికారులతో రాష్ట్ర ప్రభ/త్వం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలకు విదేశాల్లోని వ్యాపార వర్గాల్లో మరింత అవగాహన కల్పించడంలో సహకరించాలని అధికారులను కోరారు.
భారతదేశంలో ప్రస్తుతం అనేక వ్యాపార అవకాశాలున్నాయని ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలు వినూత్నమైన పాలసీలతో ముందుకు పోతున్నాయని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మాక్లస్టర్ , మెడికల్ డివైజెస్ పార్క్, జీనోమ్ వ్యాలీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రస్తావించారు.
తెలంగాణ లాంటి రాష్ట్రాలు చేపడుతున్న పెట్టుబడుల స్నేహపూర్వక విధానాలను విదేశాల్లోని వ్యాపార వర్గాల్లో విస్తృత ప్రచారం కల్పించే దిశగా పని చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూఫ్లెమింగ్ తదితరులు పాల్గొన్నారు.