బీసీల జనాభా ఎందుకు తగ్గింది?: కేటీఆర్

1
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో బిల్లు ఏమైనా తెస్తున్నారేమో అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సోదరులు అనుకున్నారు అన్నారు కేటీఆర్.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు.. నాడు బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంటే, రేవంత్ రెడ్డి ప్రజలకు తమ వివరాలు ఇవ్వద్దని బహిరంగంగా పిలుపునిచ్చారు.57 రకాల వివరాలను ఎలా ఇస్తాం? ఎవరికి పడితే వారికి ఎలా ఇస్తాం?” అంటూ మాట్లాడారు అని గుర్తు చేశారు

ముఖ్యమంత్రి గారు ప్రజలను మిస్‌లీడ్ చేస్తున్నారు..ఆనాటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1 కోటి 85 లక్షల 61 వేల 856 – అంటే 51% ముస్లిం బీసీల 10% కూడా కలిపితే, మొత్తం బీసీల సంఖ్య 61%..కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే సర్వే రిపోర్ట్‌ను తగలబెట్టండి అని చెబుతూ, ఇంకా గలీజుగా మాట్లాడాడు.
రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు – “51% ఉన్న బీసీ జనాభా 46% ఎట్లా అయింది” చెప్పాలన్నారు.1 కోటి 64 లక్షలకు బీసీ జనాభా ఎలా తగ్గిందని ప్రశ్నిస్తున్నారు అన్నారు.

Also Read:వరల్డ్ కప్ అందించడమే లక్ష్యం!

 

- Advertisement -