పురపాలిక శాఖ దశాబ్ది నివేదికను రిలీజ్ చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడి పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా దశాబ్ది నివేదికను రిలీజ్ చేశామని వెల్లడించారు. పారదర్శకత, జవాబుదారితనం లక్ష్యంగా దశాబ్ది నివేదిక ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు కేటీఆర్.
నగర అభివృద్ధి కోసం అనేక ఎస్‌పీవీలు ఏర్పాటు చేశామని…ఎస్ఆర్‌డీపీ ద్వారా 35 వరకు ఫ్లై ఓవర్లు నిర్మించామని తెలిపారు. ఉప్పల్, అంబర్‌పేట ఫ్లై ఓవర్లను జాతీయ హైవే సంస్థ పూర్తి చేయలేకపోతుందని… తాము 35 ఫ్లై ఓవర్లు పూర్తి చేస్తే, వాళ్లు 2 కూడా చేయలేకపోతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో 26 మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డులు ఇచ్చిందని…కొత్త పురపాలక చట్టం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని తెలిపారు. తొమ్మిదేండ్లలో పురపాలక శాఖ ద్వారా రూ. 1.21 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ పదేండ్లలో 462 శాతం ఎక్కువ ఖర్చు చేశామని తెలిపారు.
Also Read:KTR:ప్రపంచంతో పోటీ పడదాం
వరద ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని.. ఎస్ఎన్‌డీపీ కింద నాలాలను అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో రూ. 238 కోట్లతో 19 పనులు చేపట్టాం అని తెలిపారు. తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేస్తున్నాం అని తెలిపిన కేటీఆర్… అన్ని పట్టణాల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం అని వెల్లడించారు.