KTR:పదేండ్లు కమిట్‌మెంట్‌తో పనిచేశాం

27
- Advertisement -

మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్‌ మోసం చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవేళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్..ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను రేవంత్ సర్కారు గోసపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పదేండ్లు కమిట్‌మెంట్‌తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు రావడం లేదని…రైతుబంధు అడిగితే చెప్పుతీసి కొడతామని అంటున్నారని విమర్శించారు.

కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగం సామాన్య కాంగ్రెస్‌ కార్యకర్త ప్రసంగం కంటే హీనంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ ఐదేండ్లు అధికారం నిలుపుకుంటుందా.. లేదా వేచి చూద్దామన్నారు.

కాంగ్రెస్‌ బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భయపడొద్దని సూచించారు. ఎలాంటి కష్టం వచ్చినా తాము అండగా నిలబడతామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ త్వరలో ప్రజల్లోకి వస్తారని చెప్పారు.

Also Read:Chandrababu:బాబుకు రిలీఫ్.. ఇక తిరుగేలేదా?

- Advertisement -