నాన్నకు ప్రేమతో…హిమాన్షు అన్నదానం

818
himanshu
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా తీసుకొచ్చిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు తమకు తోచిన విధంగా ఇతరులకు సాయం చేస్తూ కేటీఆర్‌ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరికొంతమంది మొక్కలు నాటుతూ రామన్నకు విషెస్ చెబుతుండగా నేను సైతం అంటూ ముందుకొచ్చారు కేటీఆర్ తనయుడు హిమాన్షు.

తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు హిమాన్షు. స్వయంగా పేదలకు తానే వడ్డిస్తూ వారి ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా పలువురు హిమాన్షు సేవా దృకృథాన్ని కొనియాడారు.

himanshu ktr

తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హిమాన్షు. తాత,తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ వయసు చిన్నదైనా సాయం చేయడంలో తన మనసు పెద్దదని పలుమార్లు నిరూపించుకున్నారు. భద్రాచలానికి చెందిన నూకసాని శ్రీనివాసరావుకు రోడ్డు ప్రమాదంలో వెన్నుపూజ దెబ్బతినగా సోషల్ మీడియా ద్వారా వివరాలు తెలుసుకున్న హిమాన్షు సాయం అందించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

ktr himanshu

- Advertisement -