పోలీస్ స్టేషన్లే సెటిల్‌మెంట్ల అడ్డాలా?

7
- Advertisement -

పోలీస్ స్టేషన్లే సెటిల్‌మెంట్ల అడ్డాలా చెప్పాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్.కాంగ్రెస్ నాయకులు ఏం చేప్తే అది చేయడాన్నే డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎవరిని వదిలిపెట్టమన్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ నేతలు ఎవరూ కూడా ఇంత చిల్లర, లేకి పనులు చేయలేదన్నారు.

తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే ఉల్టా తమ పార్టీ నేత కర్కబోయిన కుంటయ్యపైనే కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కుంటయ్య భౌతికకాయానికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.

తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేయడం, పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలకడంతో కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు.

Also Read:ప్రశ్నిస్తే కేసులా..రైతులకు రూ.800 కోట్లు బాకీ

- Advertisement -