కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్ని అలవిగానీవేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఆయన చెప్పిన ప్రతీ మాటకు రికార్డు ఉందని…ఆయన్ను మేము ఎందుకు వదిలిపెడతామన్నారు. అధికారంలోకి వచ్చిన 24గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని…రాగానే పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారన్నారు. పదిరోజులు ఆగండి.. 15వేలు రైతు భరోసా ఇస్తాం అన్నారు కానీ ఇవ్వలేదన్నారు.
మొదటి కేబినెట్ లోనే ఆరు గ్యారంటీ లకు చట్ట బద్దత కల్పిస్తాం అన్నారు ఏమైంది అని ప్రశ్నించారు. రుణ మాఫీ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు అన్నారు. ఎలా చేస్తారో మేము కూడా చూస్తాం..ఎవరైనా అధికారంలోకి రాక ముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారన్నారు. కానీ వీళ్లు మాత్రం ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారు అని దుయ్యబట్టారు.మేము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందని…వారు చూసుకోక పోతే మాకేం సంబంధం అన్నారు.
Also Read:సెమీ న్యూడ్‌గా దీపికా పడుకోణె!