KTR:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్

36
- Advertisement -

కాంగ్రెస్ హయాంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహిళలు రోడ్ల పైన ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి లంక బిందెల కోసం మాట్లాడుతున్నాడని…ఢిల్లీకి ధనరాశులను తరలిస్తున్న రేవంత్ రెడ్డికి జలరాశులు తరలించే ఓపిక లేదు అన్నారు.

గతంలో మేము ప్రజల అవసరాలు ఎట్ల తీర్చాలని ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చేరికల పైన దృష్టి పెట్టిందని…ఢిల్లీకి డబ్బు సంచులు పంపడం పైన దృష్టి పెట్టారన్నారు. గత పది సంవత్సరాలలో మా ప్రభుత్వం తండాల నుంచి మొదలుకొని హైదరాబాద్ దాకా ఏరోజు కూడా తాగునీటి ఇబ్బందులు రానియ్యలేదు..మంచినీళ్లను మానవ హక్కుగా గుర్తించి 38వేల కోట్లతో మిషన్ భగీరథను చేపట్టి పూర్తి చేశాం అన్నారు.

50 ఏళ్ల పాటు హైదరాబాదు నగరానికి తాగునీటి కొరత రాకుండా చేశాం…కనీసం వాటి నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.కెసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాదులో ట్యాంకర్ల హడావిడి మొదలైందని…రాష్ట్రంలో ఇన్వర్టర్లు, జనరేటర్లతో పాటు ట్యాంకర్ల దందా స్టార్ట్ అయిందన్నారు.మూడు నాలుగు రెట్లు పెట్టి ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నారు…ఇది ప్రకృతి కొరత వల్ల వచ్చిన తాగునీటి కొరత కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్ల వచ్చిన కొరత అన్నారు.

గతంలో కురిసిన వర్షం కంటే 14% అధికంగా వర్షం ఉన్న తాగునీటి కొరత ఎందుకు వచ్చింది..ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి.. వాటిని నిర్వహించే తెలివి ప్రభుత్వానికి లేదు అన్నారు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి.. ప్రజల కోసం చేతనైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి..ఫోన్ ట్యాపింగ్ కాదు. వాటర్ ట్యాపింగ్ పైన దృష్టి పెట్టండి..సాగర్ లో, ఎల్లంపల్లిలో, హిమాయత్ సాగర్ లో, ఉస్మాన్ సాగర్ లో నీళ్లు ఉన్నా… ప్రజలు ఎందుకు ట్యాంకర్లు బుక్ చేసుకోవాలని ప్రశ్నించారు. తాగునీటి ఇబ్బందులు ఎందుకు పడాలి ముఖ్యమంత్రి చెప్పాలి…సంవత్సరం పాటు నగర జనాభా అవసరాలకు అవసరమైన నీళ్లు నాగార్జునసాగర్ లో ఉన్నా…హైదరాబాద్ నగరం లో ఇంత తీవ్ర నీటి కొరత ఎందుకు ఉందన్నారు. గతంలో కన్నా రెట్టింపు ట్యాంకర్లు నగరంలో నడుస్తున్నాయి…ఈరోజు దాదాపు రెండు లక్షల 30 వేల ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు….వీటి ద్వారా ప్రజలపై పడుతున్న భారం కాంగ్రెస్ పార్టీ వేసిందే కదా అన్నారు.

Also Read:TTD:శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

- Advertisement -