రేవంత్ రెడ్డి అబ్బ సొత్తు, తాత జాగీరు కాదు గోదావరి నీళ్లు అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. చంద్రబాబు నాయుడు కమిటీ వేద్దామని అనగానే తల ఊపడానికి నీళ్లు రేవంత్ రెడ్డి జాగీరు కాదు, మేము కాళేశ్వరం కడుతుంటే అడ్డుకోవడానికి ఇదే చంద్రబాబు నాయుడు లేఖలు రాశాడు అన్నారు.
గోదావరి, కృష్ణా జలాల్లో మా వాట తేల్చి, మా నీళ్లు మేము తీసుకున్నాక మిగతా నీళ్లు తీసుకోవాలి… మేము ఆంధ్రా ప్రజలకు, రైతులతో వ్యతిరేకం కాదు అన్నారు. తెలంగాణ ప్రజల, రైతుల ప్రయోజనాలు ముఖ్యం – కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు GRMB, KRMB తెలంగాణలోనే ఉన్నాయి అన్నారు. ఇవాళ KRMBని ఆంధ్రాకి తరలించి అదికూడా గొప్ప విజయమని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు అన్నారు.
Also Read:సీఎం రేవంత్ రాజీనామా చేయాలి: కవిత
రేవంత్ రెడ్డి జుట్టు మా చేతిలో ఉంది, కేంద్రం మా చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటే మేము కచ్చితంగా వ్యతిరేకిస్తాం.. నది ఏ బేసిన్ లో ప్రవహిస్తదో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాక, కింది ప్రాంతాలు మిగతా నీళ్లు తీసుకోవాలి అన్నారు. గోదావరి, కృష్ణా నదులు సింహభాగం మన తెలంగాణలో ప్రవహిస్తాయి.. ముందు మన అవసరాలు, మనం తాగడానికి నీళ్లు తీసుకోవాలి… మా నికర జలాల్లో, మిగులు జలాల్లో మా వాటాను కేంద్రం తేల్చకుండా, నీళ్లు మేము తీసుకుంటామని ఆంధ్రా నాయకులు అనడం ఎలా? అని ప్రశ్నించారు.

