KTR: గాడ్సే శిష్యుడు రేవంత్..

3
- Advertisement -

రేవంత్ రెడ్డి గాడ్సే శిష్యుడు….గాడ్సే శిష్యుడు గాంధీ విగ్రహం పెడుతాడంట అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాంధీ మనవడు ఏమో విగ్రహం వద్దు, ఆ డబ్బుతో పేదలకు మంచి చేయండి అంటే.. ఈ గాడ్సే శిష్యుడు ఏమో విగ్రహం పెడుతాడంట అని చురకలు అంటించారు. కేసీఆర్ ను కతం చేస్తా అన్నోళ్లు ఎంతో మంది కనుమరుగైపోయిండ్రు…గుంపు మేస్త్రి పగటి కలలు కంటున్నాడని మండిపడ్డారు.

కేసీఆర్ నాయకత్వంలో అభివృద్దే మన కులంగా, సంక్షేమమే మన మతంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని పదేళ్ళ పాటు చూసుకున్నాం కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా, ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిచిందన్నారు.

ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్లు మేకలను కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చెప్తున్నారు…ఖర్గే గారిని నేను తెలంగాణ రమ్మని చెప్తున్నా.. ఇక్కడ మా మేకలు మీ మందలో తప్పిపోయాయి చూడాలని కోరుతున్నా అన్నారు. ప్రకాష్ గౌడ్, గాంధీలకు సిగ్గుందా? ఏ పార్టీలో ఉన్నారో చెప్పే దమ్ముందా? చెప్పాలన్నారు.

Also Read:యూపీ ఘటనపై రాహుల్ దిగ్బ్రాంతి

- Advertisement -