KTR:రేవంత్ రెడ్డివి మూర్ఖపు నిర్ణయాలు

9
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ నాయకులతో కలిసి చార్మినార్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్…గత పదేళ్లలో ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి గురించి ప్రజలకు చెప్పాలన్నారు.కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా వ్యవహరిస్తోంది…గత పదేళ్లలో జరిగిన మంచిని, అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక రాజకీయ దుగ్ద, కక్షతో వ్యవహరిస్తోందన్నారు.

పదేళ్లలో ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరగాలి…పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా మూర్ఖ, మొండి వైఖరితో కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు.కేసీఆర్ కి పేరు రావొద్దొని, కేసీఆర్ గారి పేరు వినబడవద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. తెలంగాణ అనగానే హైదరాబాద్, వరంగల్ గుర్తొస్తాయి. కాకతీయ సామ్రాజ్యపు వారసత్వ సంపద కాకతీయ కళాతోరణం,తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

చార్మినార్‌ను తొలగించటమంటే ప్రతి హైదరాబాదీని అవమానపర్చినట్టే.. ప్రతి ఒక్కరిని అగౌరవపరిచినట్టేనన్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చామని, మేలు చేయమని, పథకాలు అమలుచేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని…ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి.. ప్రజలు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించకండని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. తెలంగాణ షాన్ హైదరాబాద్.. హైదరాబాద్ ప్రతీక చార్మినార్..ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే దాని ప్రతీక చార్మినార్ అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు.

Also Read:రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ

- Advertisement -