KTR: పొంగులేటి స్కాంలన్నీ బయటపెడతాం?

7
- Advertisement -

సివిల్ స్కాం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీల లీలలు కూడా భయపెట్టేందుకు మళ్లీ మళ్లీ ఢిల్లీకి వస్తాం అన్నారు కేటీఆర్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్ వద్ద చెక్ పోస్ట్ లు పెంచాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి. భారీగా తెలంగాణ నుంచి అవినీతి సొమ్ము మహారాష్ట్రకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. తెలంగాణ లో రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో నిరాటంకంగా దోపిడీ చేస్తున్నారని ప్రధాని మోడీయే అంటున్నారు అన్నారు.

ప్రధాని మోడీయే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు. కానీ ఎందుకు మీరు రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవటం లేదు…తెలంగాణలో బీజేపీ ఎనిమిది మంది ఎంపీల్లో ఒక్క ఎంపీ కూడా రేవంత్ రెడ్డికి వ్యవతిరేకంగా మాట్లాడటం లేదు అన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను నాలుగు ముక్కలుగా చేసి నగర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. దీనికి బీజేపీ ఎంపీలు మద్దతు పలుకుతున్నారు అన్నారు.

తెలంగాణ నుంచి పెట్టుబడులు బీజేపీ రాష్ట్రాల్లోకి తరలించాలన్నదే రేవంత్ రెడ్డి అజెండా…తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేదాన్ని విఫల ప్రయోగమని చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. కనుక ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని కోరుతున్నా. మీ సొంత నియోజకవర్గంలోనే ప్రజలు తిరగబడుతున్నారు. మీ చేతగానీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అన్నారు. మీ అమృత్ స్కాం, మీ సివిల్ స్లపయ్ స్కాం సహా మీ అన్ని స్కాం లను బయటపెడుతాం…మీ స్కామ్ లను ధారావాహిక మాదిరిగా రోజుకొకటి బయట పెడుతాం అన్నారు.

ఢిల్లీకి వచ్చి మీ స్కాం లకు సంబంధించి మొత్తానికి దేశానికి మీ బాగోతం తెలిసేలా చేస్తాం…. అమృత్ టెండర్ల స్కాం లో వివరంగా మేము కేంద్రానికి తెలిపాం. వీటి మీద విచారణ జరుపుతారని భావిస్తున్నాం అన్నారు. ఒక వేళ విచారణ జరపకపోతే జనమే కాంగ్రెస్, బీజేపీ బంధంపై అనుమానాలు వ్యక్తం చేస్తారు..తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ది ఆజమ్ ప్రేమ్ కీ గజమ్ కహానీ నడుస్తోందన్నారు. రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే బీజేపీ ఎంపీలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు ఇస్తారు. రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని చెబుతున్నారు…బీజేపీకి చెందిన 8 మంది ఎంపీల్లో ఒక్కరు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు అన్నారు.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ ప్రత్యర్థులు. కానీ తెలంగాణలో మాత్రం వాళ్ల ప్రేమ్ కహానీ నడుస్తోందని…ఎమ్మెల్యేలను మేకల బజార్ లో మేకలను కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే అంటున్నారు అన్నారు. కానీ తెలంగాణలో మా పార్టీ 10 మంది ఎమ్మెల్యేలను మేకల మంది లో కొన్నట్లు ఇంటింటికి వాళ్ల ముఖ్యమంత్రి వెళ్లి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు అన్నారు. అందరి కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది అదీ కాంగ్రెస్ పార్టీయే….ప్రతి ఒక్కరినీ కొనుగోలు చేయటం, ఎమ్మెల్యేలను కొనటం, ఆయా రాం, గయా రాం కల్చర్ ను ఇందిరాగాంధీ హయాం నుంచే కాంగ్రెస్ పార్టీ తెచ్చిందన్నారు. అలాంటి పార్టీయే ఇవ్వాళ ఎమ్మెల్యే కొనుగోలు పై దొంగ ఏడుపులు ఏడుస్తే ఎవరూ నమ్మరు…ఏదైనా ఒక కంపెనీకి పనులు ఇవ్వాలంటే వారికి టెక్నికల్ క్వాలిఫికేషన్, లేదంటే ఫైనాన్షియల్ కెపాబులిటీ అయినా ఉండాలన్నారు. కానీ రూ. 2 కోట్ల రూపాయల లాభం ఉన్న వంద కోట్ల పనులు కూడా చేయని కంపెనీకి వెయ్యి కోట్లకు పైగా పనులు ఇవ్వటమంటే దాన్ని క్రోని క్యాపిటల్ అనకపోతే ఏమనాలి…ఇవ్వాళే నేను మళ్లీ హైదరాబాద్ కు వస్తున్నా. నా మీద ఏ ఎంక్వైయిరీ చేస్తారో చేసుకోమని నేను చెబుతున్నాను అన్నారు. నామీద ఏ కేసు పెడతానన్న, ఏ ఏజెన్సీ తో విచారణ జరిపించిన సరే నేను రెడీ..కానీ నేను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని అడుగుతున్నా…మీరు అదానీ కాళ్లు పట్టుకొని మీ పై ఎలాంటి కేసులు లేకుండా చేసుకున్నారా లేదా? చెప్పాలన్నారు.

Also Read:Pawan:మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్

- Advertisement -