కాలుష్య కారక పరిశ్రమలను నగరం అవతలికి తరలిస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…మురుగు నీరుతో పాటు మానవ తప్పిదాల వల్లే చెరువులు కలుషితం అవుతున్నాయని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో 3,132 చెరువులు ఉన్నట్లు తెలిపిన కేటీఆర్ ఓఆర్‌ఆర్ పరిధిలోపల 40 చెరువులను శుద్ధి చేస్తున్నామన్నారు. నగరంలోని చెరువులు శిఖం పట్టాల్లో ఉన్నయని చెప్పారు. హైదరాబాద్‌లో 54 నాలాలు ఉన్నట్లు తెలిపారు. 90 శాతం సీవరేజ్ మూసీ నదిలోకి వెళ్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
మూసినదిని మంచినీటితో నింపేందుకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారని తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మూసిలో లక్షలాది విగ్రహాల నిమజ్జనం మూలంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
1,234 కాలుష్య కారక పరిశ్రమలు ఉన్నయని.. కాలుష్య కారక పరిశ్రమలను నగరం అవతలికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మూడు నెలల్లో 100 కాలుష్య కారక పరిశ్రమలను తరిలిస్తమని వెల్లడించారు. ఫార్మా సిటీకి మరో 400 పరిశ్రమలను తరలిస్తమన్నారు.