KTR:రేవంత్ మాట్లాడేవి అన్ని పచ్చిఅబద్దాలే

17
- Advertisement -

వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా ఇల్లెందులో జరిగిన సన్నాహాక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఫీజుల్లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగాల ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తామ‌ని చెప్పారు..నాడు కేసీఆర్ హ‌యాంలో టెట్‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 400 ఉంటే ఇప్పుడు 2 వేలకు పెంచారన్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాల‌పై ప‌చ్చి అబ‌ద్దాలాడుతున్న రేవంత్ స‌ర్కార్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల‌ను తాను ఇచ్చాన‌ని రేవంత్ అబ‌ద్ద‌పు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క నోటిఫికేష‌న్ కూడా కొత్త‌గా ఇవ్వ‌లేదు. కానీ 30 వేల ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పడం హాస్యాస్పదం అన్నారు.

ఒక ఉద్యోగం ఇవ్వాలంటే నోటిఫికేష‌న్, ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ జ‌రిగిన త‌ర్వాత‌ నియామ‌కం ప‌త్రం ఇవ్వాలి. మ‌రి రేవంత్ వ‌చ్చిన త‌ర్వాత ఎన్ని నోటిఫికేష‌న్లు ఇచ్చారు..? ఆలోచించాలన్నారు. మ‌రోసారి నిరుద్యోగుల‌ను పిచ్చొళ్ల‌ను చేయ‌డానికి నోటికొచ్చిన‌ట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని…30 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చింది కేసీఆర్ ప్ర‌భుత్వం.. నియామ‌క ప‌త్రాలు ఇచ్చింది మాత్ర‌మే రేవంత్ రెడ్డి అని తెలిపారు కేటీఆర్. రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే శాస‌న‌మండ‌లిలో ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తాడ‌ని కేటీఆర్ తెలిపారు.

Also Read:Congress:రేవంత్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

- Advertisement -