KTR: లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీనా?

8
- Advertisement -

పోలీసులు లగచర్ల రైతుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలు పెట్టారు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంగారెడ్డి జైలులో లగచర్ల రైతన్నలను జైలులో ములాఖాత్ లో కలిసింది బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం.

అనంతరం మాట్లాడిన కేటీఆర్…కొడంగల్ సీఐ, ఎస్ఐ వికారాబాద్ ఎస్పీ వీళ్ళంతా కలిసి లగచర్ల రైతుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలు పెట్టారు అన్నారు.కాళ్ళు, చేతులు కమిలిపోయి ఉన్నాయి మేజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదు అని అడిగితే.. చెప్తే మల్లి కొడతాము, మీ ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళని కూడా కొడతామని బెదిరించారని చెప్పారు అన్నారు.

రైతులను పరామర్శించిన వారిలో కేటీఆర్‌తో పాటు సత్యవతి రాథోడ్,చింత ప్రభాకర్,అనిల్ జాదవ్, రమావత్ రవీంద్ర కుమార్, జాన్సన్ నాయక్ తదితరులు ఉన్నారు.

Also Read:డయాబెటిస్‌..ఈ ఆహారం తప్పనిసరి!

- Advertisement -