KTR:అదానీతో ఎంవోయూలు ఎందుకు రద్దు చేసుకోరు?

0
- Advertisement -

రాహుల్ గాంధీ అదానీని దుర్మార్గుడు, అవినీతిపరుడు అంటున్నాడు.. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న ఎంవోయూలు ఎందుకు రద్దు చేయడం లేదు? అని ప్రశ్నించారు కేటీఆర్. కెన్యా దేశపు తలసరి ఆదాయం 2000 డాలర్లు.. అదే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 5000 డాలర్లు.. అలాంటి కెన్యా దేశపు అధ్యక్షుడు, అదానీ లంచగొండి అని తెలిశాక అతనితో వ్యాపారాలు రద్దు చేశాడు అన్నారు.

కానీ రోజు అదానీని తిట్టే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇంకా అదానీతో ఎంవోయూలు ఎందుకు రద్దు చేసుకోలేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్న హైకమాండ్ ఆదేశాలు కావాలని…చిన్న చిన్న కార్పొరేషన్ పదవులకు హైకమాండ్ ఆజ్ఞ లేనిది ఇవ్వరు.. అలాంటిది హైకమాండ్ ఆదేశాలు లేనిదే అదానీతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటుందా? చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో రోజు అదానీని తిడుతాడు, తెలంగాణలో వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటాడు అని దుయ్యబట్టారు.

Also Read:ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు…షర్మిల ఫైర్!

- Advertisement -