KTR:ఢిల్లీ బానిస పార్టీలు జాతీయ పార్టీలు

49
- Advertisement -

ఢిల్లీ బానిన పార్టీలు జాతీయ పార్టీలు అని విమర్శించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఎన్నికలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే.తారకరామారావు మీడియతో చిట్ చాట్‌లో మాట్లాడారు. రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదు అన్నారు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ , ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదు అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చి సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి అన్నారు. ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు.

తమ పార్టీ నాయకులపైననే చెప్పులు విసిరి పార్టీ కాంగ్రెస్ అని…తెలుగువారి గౌరవం పీవీ నరసింహారావు పైననే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్ ది అని అన్నారు. ఢిల్లీ బానిస పార్టీలు జాతీయ పార్టీలు… ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరన్నారు. తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా, తెలంగాణ బిడ్డ కావాలా తెలుసుకోవాలన్నారు. కేవీపీ రామచంద్రరావు, షర్మిలలు, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారన్నారు.

తెలంగాణను వ్యతిరేకించిన కెవిపి, షర్మిలలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి తేస్తాం అంటున్నారు. ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టిందని…తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజల పైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి.. వీరు తెలంగాణ కోసం ముసుగులో వచ్చారన్నారు. తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి…కేవీపీ రామచందర్రావు… షర్మిల వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారు… బహురూపుల వేషాల్లోలో తెలంగాణ పైకి వస్తున్నారు. వీరందరితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. పదేళ్లు సాధించిన అభివృద్ధిని, తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడదామా ప్రజలు తెలుసుకోవాలని…పైకి కనబడేది కిషన్ రెడ్డి అదించేది కిరణ్ కుమార్ రెడ్డి, కనబడేది రేవంత్ రెడ్డి ఆడించేది కేవీపీ రామచంద్రరావు అన్నారు.

Also Read:పిక్ టాక్ :ఉప్పొంగిన పరువాల విస్ఫోటనం

తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన కేవీపీ రామచంద్రరావు ఈరోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం మా కర్మ అని…రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకరైన తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా… ఒక్కరన్న రాజీనామా చేశారా..కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లుతాయి అని తెలంగాణ ప్రజలు బెదిరించి, మెడలు వంచితే తెలంగాణ ఇచ్చింది సోనియా ఇచ్చింది అంటే అన్యాయంగా ఉంటుందన్నారు.

Also Read:న‌మ్మాలా, వ‌ద్దా?.. మీమాంశ‌లో అల్లు అర్జున్

- Advertisement -