KTR: ఇది మూసీ లూటిఫికేషన్

2
- Advertisement -

మూసీ సుందరీకరణపై మరోసారి మండపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ బ్యూటీఫికేషన్ ..మూసీ లూటిఫికేషన్‌ అని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్… మూసీ సుంద‌రీక‌ర‌ణ‌పై డీపీఆర్ కాదు.. ప్రాజెక్టు రిపోర్టు కూడా లేద‌ని తెలిపారు.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కూడా చేసుకోలేని అస‌మ‌ర్థుడు రేవంత్ రెడ్డి అని విమ‌ర్శించారు. డ‌బ్బు సంచుల కోస‌మే మూసీ ప్రాజెక్టుకు రాహుల్ అనుమ‌తి ఇచ్చారు. రేవంత్ రెడ్డి కాదు.. రాహుల్ గాంధీనే హైడ్రాను న‌డిపిస్తున్నారు అని దుయ్యబట్టారు. రాహుల్ వెనుకుండి పేద‌ల ఇండ్ల‌పైకి బుల్డోజ‌ర్ న‌డిపిస్తున్నారు. కేవ‌లం డ‌బ్బుల కోస‌మే మూసీ ప్రాజెక్టును రాహుల్ చేప‌ట్టారు. బుల్డోజ‌ర్ ప్ర‌భుత్వంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే రాహుల్ ఎక్క‌డున్నారు..? అని ప్రశ్నించారు.

మూసీ ప్రాజెక్టు కోసం డ‌బ్బులు ఎక్క‌డ్నుంచి తెస్తారు..? అని కేటీఆర్ నిల‌దీశారు. మూసీపై రెండు, మూడు రోజుల్లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇస్తాను అని తెలిపారు. మూసీ విష‌యంలో సీఎంకు, మంత్రుల‌కు స‌యోధ్య ఉన్న‌ట్లు లేద‌న్నారు. మూసీ ప్రాజెక్టును ఏ కాంట్రాక్ట‌ర్‌కు ఇస్తారో త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడుతా. కాంగ్రెస్‌కు నోట్ల క‌ట్ట‌లు కావాలి.. కానీ బాధితుల క‌ష్టాలు ప‌ట్ట‌వా..? అని కేటీఆర్ నిల‌దీశారు.

Also Read:TTD: డిక్లరేషన్‌పై సంతకాలు చేసిన పవన్

- Advertisement -