KTR:బడే భాయ్..చోటా భాయ్..ఇద్దరు మోసగాళ్లే

22
- Advertisement -

బడే భాయ్ మోడీ..చోటా భాయ్ రేవంత్ ఇద్దరు మోసగాళ్లేనని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా రోడ్ షో లో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..గత ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీ తో గెలిచిండు…రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి ఎంతో ఇచ్చింది. పీసీసీ, సీఎం పదవులు రావటానికి మల్కాజ్ గిరి ప్రజలే కారణం అన్నారు.అలాంటి రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలకు ఏమి చేసిండు…పార్లమెంట్ లో పత్తా లేకుండా పోయిండు. ప్రజలకు కష్టం వస్తే కనబడకుండా పోయిండన్నారు.

ఈ వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కనబడరు…మీకు 24 గంటలు అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించండన్నారు. పదేళ్ల అభివృద్ధి కేసీఆర్ పాలన…వంద రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి పాలన…బడే భాయ్ మోడీ మనకు బడా మోసం చేసిండు…చోట భాయ్ రేవంత్ రెడ్డి మనల్ని ఇక్కడ మోసం చేసిండు అని విమర్శించారు.

వంద రోజుల్లో అందరికీ అన్ని చేస్తా అంటూ చోటా భాయ్ మోసం చేసిండు..గద్దెనెక్కంగా వెంబడే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు..రుణమాఫీ అయ్యిందా? తులం బంగారం వచ్చిందా? మహిళలకు రూ. 2500 వచ్చినయా?,పైన పెద్ద మోసగాడు…కింద చిన్న మోసగాడు పాలిస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్ -1 అనే సినిమా చూపించిండు…ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు మోసం పార్ట్ -2 సినిమా చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల మోడీకి మేలు చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది..రాహుల్ గాంధీ ఏమో చౌకిదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ హమారా బడే భాయ్ అంటాడన్నారు. రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కాం ఏం లేదంటాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని అంటాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడు…రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా మోడీ కోసం పనిచేస్తుండా ? ఆలోచించాలన్నారు.

Also Read:Ram Dev:మరోసారి క్షమాపణ చెప్పిన రాందేవ్

- Advertisement -