ఈడీ అధికారులపై కేటీఆర్ ఫైర్

33
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈడీ అధికారులపై తీరుపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా అరెస్ట్‌ ఎలా చేస్తారని నిలదీశారు.

కేసు విచారణలో ఉన్నందున అరెస్ట్‌ చేయబోమని సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన మీరు ఇప్పుడు ఎలా ఆ మాట తప్పుతారని ప్రశ్నించారు.సెర్చ్‌ వారెంట్‌ ఇచ్చి సోదాలు పూర్తిచేశామని, అరెస్ట్‌ వారెంట్‌ ఇచ్చి అరెస్ట్‌ చేస్తున్నామని ఈడీ అధికారిణి భానుప్రియ మీనా మేడమ్‌ చెబుతున్నారని, ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా అరెస్ట్‌ ఎలా చేస్తారని ఆయన మండిపడ్డారు. లాయర్‌ను కూడా లోనికి అనుమతించడం లేదని విమర్శించారు.

Also Read:వివేకా హత్యలో ‘జగన్ పాత్ర’?

- Advertisement -