KTR:డబ్బుల కోసమే పార్టీ మారుతున్నారు

15
- Advertisement -

డబ్బుల కోసమే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జగిత్యాలలో  మాట్లాడిన కేటీఆర్… సొంత ప్రయోజనాలు, డబ్బులు సంపాదించుకునేందుకే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంజయ్‌ను ఎమ్మెల్యేను చేసింది ఎవరు?,జగిత్యాలను జిల్లా చేసి వైద్య కళాశాలను తీసుకువచ్చింది కేసీఆరేనని అన్నారు.ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి వచ్చారని చెప్పారు. ఆ హామీల నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

గాలి వీస్తే గడ్డపారలు కొట్టుకుపోవని, గడ్డి పోచలే కొట్టుకుపోతాయని చెప్పారు. సంజయ్ కుమార్‌కి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటి చేయాలని సవాలు విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించాలని చాలెంజ్ ఇచ్చారు.

Also Read:ఓటీటీలోకి హ‌రోంహ‌ర!

- Advertisement -