- Advertisement -
గవర్నర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మంత్రి కేటీఆర్. గవర్నర్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశారన్నారు. ఇప్పటికీ గవర్నర్ బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని…గవర్నర్ గా తమిళ సై నియామకమే సర్కారియా కమిషన్ కు విరుద్ధం అన్నారు. సర్కారియా కమిషన్ ను తుంగలో తొక్కింది ప్రధానీ మోడీ కాదా అని ప్రశ్నించారు.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గవర్నర్ వ్యవస్థతో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అన్నారు.
గవర్నర్లు మోదీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని…అసలు దేశానికి ఈ గవర్నర్ వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించారు. ఎవరు అర్హులు..ఎవరు అర్హులు కారో ప్రజలే నిర్ణయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:బాలయ్య టీడీపీ పరువు తీస్తారా ? నిలబెడతారా?
- Advertisement -