KTR:ఈటలతో ఒరిగేదేమీ లేదు

27
- Advertisement -

మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ గెలిస్తే ఒరిగేదేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్‌గిరి పార్టీ నేతలతో మాట్లాడిన కేటీఆర్….బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో, గజ్వేల్ లో ఓడిపోతే మల్కాజిగిరి కి వచ్చిండు…హుజూరాబాద్ లో సెంటిమెంట్ మాటలు చెప్పి… గెలిచిన తర్వాత ముఖం చాటేశాడన్నారు.

రాజేందర్ అన్న నువ్వు టిఆర్ఎస్ లో ఉన్న అనుకుంటున్నావ్… మీ బీజేపి, నరేంద్ర మోడీ 14.50 లక్షల కోట్లు కార్పొరేట్లకు, రుణాలు మాఫీ చేసినారు గాని రైతన్నలకు ఒక రూపాయి మాఫీ చేయలేదు అని చురకలు అంటించారు. అటువంటి పార్టీలో ఉండి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటదన్నారు. దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ, బిజెపి మల్కాజిగిరికి, కంటోన్మెంట్ కి ఏం చేసిందో చెప్పి ఈటల ఓటు అడగాలని డిమాండ్ చేశారు.

609 వ స్థానంలో ఉన్న అదానిని తీసుకువచ్చి రెండో స్థానంలో కూర్చొపెట్టినందుకు నరేంద్ర మోడీ నీతిమంతుడా ఆలోచించాలన్నారు.రాజకీయాలలో సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం అది మన రాగిడి లక్ష్మారెడ్డికి ఉందన్నారు. మల్కాజిగిరిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు అంతా కెసిఆర్ ద్వారా పదవులు పొంది వెన్నుపోటు పొడిచి వెళ్లిన వాళ్ళే, వాళ్లుకు బుద్ది చెప్పాలన్నారు.మల్కాజిగిరిలో నిలబడింది లక్ష్మారెడ్డి కాదు మన గులాబీ సైనికులంతా నిలబడ్డారు అన్నట్లు పనిచేద్దాం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులతో పాటు పార్టీనే స్వయంగా పోటీలో ఉందని కష్టపడి గెలిపించుకుందాం అన్నారు.

మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మూడున్నర లక్షల మెజార్టీ మన పార్టీకి ఉందని..అయినా మనం మన కార్పొరేటర్ ఎన్నికల స్థాయిలో, సర్పంచ్ ఎన్నిక స్థాయిలో మల్కాజ్‌గిరిలో పనిచేద్దాం అన్నారు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి… మన అభ్యర్థి ఎంత తిరిగినా… మన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు విస్తృతంగా పర్యటనలు ప్రచారం చేయాలన్నారు.

Also Read:రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్-అదితి

- Advertisement -