KTR:సింగరేణిని ఖతం చేసే కుట్ర

19
- Advertisement -

సింగరేణిని ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… మోదీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత బొగ్గు మంత్రిత్వ శాఖ‌ ద్వారా ఏ టెండ‌ర్, వేలం లేకుండా.. ఒడిశాలో రెండు గ‌నుల‌ను నైవేల్లి లిగ్నైట్ లిమిటెడ్‌కు అప్ప‌గించారన్నారు.

గుజ‌రాత్‌లో గుజ‌రాత్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్, గుజ‌రాత్ ఇండ‌స్ట్రీ ప‌వ‌ర్ లిమిటెడ్‌కు 2015 సంవత్సరంలో ఐదు కోల్ బ్లాక్ లను కేటాయించారు కానీ తెలంగాణలో మాత్రం సింగరేణికి ఎందుకు గనులకు కేటాయించడం లేదు? అని ప్రశ్నించారు.

కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు తేవాల్సింది పోయి.. ఉన్నవాటినే అమ్ముతున్నారు..సింగరేణిని ఖతం చేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయన్నారు. కేసీఆర్ సింగ‌రేణిని తొమ్మిదిన్న‌రేండ్లు కాపాడితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీతో క‌లిసి బొంద పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్నారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు జీవో 46 సవరిద్దామన్న ప్రయత్నం ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు మీకు న్యాయం దక్కేవరకు బీఆర్ఎస్ పార్టీ తరపున తప్పకుండా పోరాడుతాం అని.. జీవో 46 బాధితులకు భరోసా ఇచ్చారు కేటీఆర్.

Also Read:దేశంలో బలమైన ప్రతిపక్షం:రాహుల్

- Advertisement -