6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం అయ్యాయని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్విట్టర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డ కేటీఆర్… పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం అన్నారు. విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం…కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నం అన్నారు.
ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం,సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నం,ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నం,
చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నం,పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నం,రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నం అని ఎద్దేవా చేశారు. చివరికి ఇవాళ జోగిపేటలో.. విత్తనాల కోసం రైతుల మొక్కులు…క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం…!ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో..ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అని సెటైర్ వేశారు కేటీఆర్.
https://twitter.com/KTRBRS?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
Also Read:TTD: పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు