KTR:వడ్డీతో సహా చెల్లిస్తాం

33
- Advertisement -

కాంగ్రెస్ వేధింపులపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబ‌ర్ 1లో ఉన్న భారీ నిర్మాణాల‌ను సోమ‌వారం ఉద‌యం అధికారులు కూల్చివేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్.

మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అండతోనే ఇండ్లను అధికారులు కూల్చివేశారని ఆరోపించారు. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతుగా వెళ్లిన‌ బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? అని ప్రశ్నించారు. మీ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవు అని తేల్చిచెప్పారు.ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయం అన్నారు. భవిష్యత్తులో మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్లాట్ ఓనర్లను న్యాయం చేయడం జరుగుతుందని …కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు.

Also Read:TTD:16 నుండి జ్యేష్ఠాభిషేకం

- Advertisement -