KTR:గనుల వేలంలో పాల్గొనడం సిగ్గుచేటు

15
- Advertisement -

గనుల వేలంలో కాంగ్రెస్, బీజేపీ పాల్గొనడం సిగ్గు చేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.ముఖ్యమంత్రి గద్దెపై రేవంత్ ఎక్కిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న తీరు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని చెప్పారు.

తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలన్న కుట్ర అందరికీ తెలిసిపోయిందని వెల్లడించారు. గనుల వేలంలో పాల్గొన్న మిమ్మల్ని, మీ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అణిచి, వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తమ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించిందన్నారు. అందుకే ప్రభుత్వం ఏ రోజూ వేలంలో పాల్గొనలేదని చెప్పారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ కొడుతుందని తెలిపారు.

Also Read:NBK 109 :బాలయ్యకు విలన్‌గా రిషి

- Advertisement -