ఇది తెలంగాణ గడ్డ…మోసం చేసినోన్ని.. బరాబర్ గల్లా పట్టి అడుగుతారు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. నిన్న జూబ్లీహిల్స్ లో ఒక పెద్దమ్మ రూ. 4 వేల పెన్షన్ ఎడబాయే అని మంత్రిని గట్టిగా నిలదీసింది అని గుర్తు చేశారు.
గరీబోళ్ల కడుపు కొట్టిన కాంగ్రెస్ కనుమరుగైతది..500 రోజుల్లో మళ్లొస్తడు కేసీఆర్ అన్నారు. రౌడీలకు, గూండాలకు బయపడేది లేదు..జూబ్లీహిల్స్ లో బారాబర్ గెలిచేది మాగంటి సునీతమ్మనే అని జోస్యం చెప్పారు కేటీఆర్.
ఇంకొక 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుంది..ఈ ఆకు రౌడీ గాళ్ళు గెలువకముందే ఇంత నిలుగుతున్నారు.. పొరపాటున గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటదో అర్థం చేసుకోండి అన్నారు. ఓట్లేయకుంటే బెదిరిస్తాడంటా, లేదంటే దొంగ ఓట్లు వేస్తాడంటా, డబ్బులతో ఓట్లను కొంటాడంటా.. ఇవన్నీ మనం చూసినవే.. పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే, పొడుగోడి నెత్తిని పోచమ్మ కొట్టిందట.. వాడికంటే మనకు తెలివి ఎక్కువే ఉంది అన్నారు కేటీఆర్.
Also Read:డీప్ ఫేక్‌పై చట్టం తేవాలి:చిరు

