KTR:రైతు భరోసా వేయాల్సిందే

1
- Advertisement -

వానాకాలం రైతు భరోసాను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వర్షాకాలానికి రైతు భరోసా పోయినట్లే అని తుమ్మల చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం చేశారు. వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందన్నారు.

వానాకాలం పంట సీజన్‌ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసిందని…లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగింది….ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు చేతులేస్తున్నట్లు ప్రకటించారు….మీ చేతగానీ తనంతో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేలేదు. సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు వీపు చింతపండు చేస్తారు అన్నారు.

ఎద్దు ఏడ్చినా ఏవుసం, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదంటారు….అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్ కు ఉసురు తప్పదు అన్నారు. రైతు భరోసాకు డబ్బులు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు…కేసీఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడు…మేము రూ. 15 వేలు ఇస్తామన్న సిఫాయి ఎక్కడ? అన్నారు.

Also Read:ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేదు:తుమ్మల

- Advertisement -