మూసీ సుందరీకరణ పాకిస్థాన్ కంపెనీకా?:కేటీఆర్

3
- Advertisement -

మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందన్నారు. ఫతేనగర్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదు అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన STPలను ఉపయోగించుకుంటే సరిపోతుంది…4వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31ఎస్టీపీలు నిర్మించాం అన్నారు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు అన్నారు.

సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తాం..పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక ఒక ఉదాహరణ అన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చేసే పనులను బీఆర్ఎస్ గతంలోనే చేసింది..కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలు అన్నారు. పబ్లి సిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు..ఇండియాలో 31ఎస్టీపీలు ఉన్న ఏకై‌న నగరం హైదరాబాద్ అన్నారు.

Also Read:35 లక్షల పెళ్లిళ్లు..రూ.4.25 లక్షల కోట్ల ఖర్చు!

- Advertisement -