రైతు భరోసాపై మోసపూరిత మాటలు చెబుతున్న కాంగ్రెస్ నేతలను ఊరూరా నిలదీయాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…ఏ ఊరిలో బోనస్ ఎంత మందికి ఇచ్చావో బయటపెట్టు. రైతు కూలీలు ఎంత మంది ఉన్నారో బయటపెట్టు అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వానాకాలం పంట పెట్టుబడి ఎగ్గొట్టారు.. వదిలిపెట్టం.. దాన్ని జమ చేసే వరకు పోరాడుతాం అన్నారు. ఏ ఊరిలో ఎంత మంది భూ యజమాలు, కౌలు రైతులు ఉన్నారో స్పష్టంగా చెప్పాలన్నారు.
రైతన్నలు ప్రభుత్వాన్ని నిలదీయండి… ప్రజా పాలనలో దరఖాస్తు ఇచ్చాం కదా.. మళ్లీ ప్రమాణ పత్రం ఎందుకు అని నిలదీయండన్నారు. 70 లక్షల ఖాతాలు నీ దగ్గర ఉన్నాయి.. పొలం వివరాలు అన్నీ తెలుసు.. తెలిసీ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నావంటే కటింగ్ పెట్టుందకు ప్లాన్ చేస్తున్నవ్.. కాబట్టి రైతులు ఊరురా నిలదీయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని కేటీఆర్ సూచించారు.
Also Read:KTR:ప్రమాణ పత్రం ఇస్తేనే రైతు భరోసానా?