KTR: డైవర్షన్ పాలిటిక్స ఇంకెన్నాళ్లు?

4
- Advertisement -

డైవర్షన్ పాలిటిక్స్‌తో ఇంకెన్నాళ్లు కాలం వెల్లదీస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. వానాకాలం వరికోతలు సాగుతున్నాయని.. నేటి వరకు రైతుబంధు వేయలేదని.. రూ.15వేల రైతుభరోసా ఊసెత్తడం లేదన్నారు.

అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయ్యిందని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామన్నారని.. అక్టోబర్‌లో నెలలో 8.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు.రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్టి నాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్‌తో బిజీబిజీగా ఉన్నాడంటూ సోషల్‌ మీడియా వేదికగా కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు.

Also Read:బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ప్రభాస్

- Advertisement -