రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన రేవంత్:KTR

24
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో మీడీయాతో మాట్లాడిన కేటీఆర్..తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కృష్ణా జలాలను KRMBకి అప్పజెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చలో నల్లగొండ కార్యక్రమాన్ని తీసుకున్నాం..కృష్ణానది బేసిన్ లో ఉన్న హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని గౌరవ ప్రతినిధులతోని సమావేశం పెట్టుకున్నాం అన్నారు.అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ నెల 13 న చలో నల్గొండ సభ ను విజయవంతం చేయడం పై కృష్ణ బాసిన లో ఉండే జిల్లాల ప్రజలు నాయకులూ కదిలి రావాలన్నారు. ఎవరైనా మా పార్టీ నుంచి వెళ్తారు అంటే దానిపైన మేము చేసేది ఏం లేదు… రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే అన్నారు.కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదని..ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాలేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లొచ్చు, చూసి నేర్చుకోవచ్చు అన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్ లు ఉన్నాయి అనే అంశాలను కాంగ్రెస్ తెలుసుకోవచ్చు..కానీ కాలేశ్వరం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస ఇంగిత జ్ఞానం లేదు అన్నారు. మేడిగడ్డ కట్టిందే kcr…కాళేశ్వరం లో వారికీ ఓనమాలు కూడా తెలవదన్నారు.కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్…కాళేశ్వరం కట్టిందే మేము …కాళేశ్వరం గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియకపోతే తెలుసుకోవచ్చు అన్నారు.

కాలేశ్వరం కట్టిందే మేము అయినప్పుడు చూడాల్సింది మేము కాదు… కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కాళేశ్వరం ద్వారా వచ్చిన నీటితో పండించిన పంటల సహాయంతోనే ఈరోజు దేశానికి తెలంగాణ ధాన్యాదారంగా నిలుస్తున్నది. దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు.కాబట్టి కాలేశ్వరం ప్రాజెక్టు విజయం గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. ప్రాజెక్టులో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం సరిచేయాలి… ప్రభుత్వానికి పూర్తి అధికార యంత్రాంగం ఉందని..మేడిగడ్డ వద్ద జరిగిన జరిగిన ఇబ్బందిని పట్టుకొని మెత్తం కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేస్తే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అన్నారు.

Also Read:శ్రీను వైట్ల కష్టాలు ఇన్ని అన్ని కావు

- Advertisement -