ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్: కేటీఆర్

2
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కోరారు బిఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రి గారిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు తెలిపింది బిఅర్ఎస్.

తెలంగాణ అప్పులపైన శాశన సభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపైన ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని కోరింది బిఅర్ఎస్. ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన అనంతరం మీడియాతో అసెంబ్లీ లాబీలో మాట్లాడారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్.

అర్ బిఅర్ఐ నివేధికలో తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్లు అని స్ఫష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుదోవ పట్టించినందున సభాహక్కులు నోటీలు ఇస్తున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అప్పుల పై ఆర్ధిక మంత్రి గారి ప్రసంగం పూర్తిగా అవాస్తవం అని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ”హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్” పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించిందన్నారు.

2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూపాయలు రూ. 3,89, 673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించిందన్నారు. ఆర్ధిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు అన్నారు.

కావున తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్ధిక మంత్రి గారిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం…శాసనసభ సాక్షిగా శాసనసభ్యులను, తెలంగాణ ప్రజలను ప్రభుత్వ రుణాలపైన తప్పు దోవ పట్టించారు. అందుకే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం అన్నారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంలోనూ సభ హక్కుల నోటీసు ఇచ్చాం…లగచర్ల వంటి బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు, టూరిజంపైన అసెంబ్లీలో చర్చ పెట్టడం ప్రభుత్వ ప్రాధాన్యతలకు అడ్డం పడుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లగచర్ల అంశంలో శాసనసభలో చర్చించాలని స్పీకర్ కి విజ్ఞప్తి చేశాం…రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల 71 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందన్నారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 3 లక్షల 89 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయని తెలిపింది…రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అసలైన అప్పులతో సవరణ స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇవ్వాలన్నారు.

లేకుంటే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని సభను ప్రవేశపెట్టాలి..గతంలో నేనే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ స్పీకర్ మనోహర్ గారు అంగీకరించారు. ఆ సందర్భంగా సభలో చర్చ కూడా జరిగిందన్నారు. గతంలో ఉన్న పద్ధతులు సాంప్రదాయాలకు అనుగుణంగా స్పీకర్ గారు ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం…గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకుని స్పీకర్ గారు శాసనసభలో అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

Also Read:KTR: రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ సెటైర్‌

- Advertisement -