రుణమాఫీ అయిన దానికన్నా కంటతడి పెట్టిన రైతు కుటంబాలే ఎక్కువ అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ సర్కార్ పంటల రుణమాఫీ చూస్తుంటే చారాణ కోడికి.. బారాణ మసాలా.. అనే సామెత గుర్తుకు వస్తుందని ఎక్స్ వేదికగా విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు.. రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే సంబరాలు ఎందుకని ప్రశ్నించారు.
సీఎం గారు…
ఊరించి.. ఊరించి..
ఏడునెలలు ఏమార్చి చేసిన..మీ రుణమాఫీ తీరు చూస్తే..
తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే..“ చారాణ కోడికి..! బారాణ మసాలా…!! ”
రుణమాఫీ అయిన రైతులకన్నా..
కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!
రైతుమాఫీ…— KTR (@KTRBRS) July 19, 2024
Also Read:Telangana Group 2: గ్రూప్ 2 డిసెంబర్‌కి వాయిదా