KTR:ఢిల్లీలో జుమ్లా పీఎం..రాష్ట్రంలో హౌలా సీఎం

5
- Advertisement -

ఢిల్లీలో జుమ్లా పీఎం… రాష్ట్రంలో హౌలా సీఎం ఉన్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్వీ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్…కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు అన్నారు. తులం బంగారం ఏమైంది అన్నందుకు కేసులు పెడుతున్నారు…దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి ఒక్కటే … రాష్ట్రంలో మూసి పేరుతో పేదల ఇండ్లు కూల్చుతుంటే బిజెపి మౌనంగా ఉంటుందన్నారు.

డిసెంబర్ 3న బిఆర్ఎస్ ఒడిపోతుందని ఎవరు అనుకోలేదు….కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిందన్నారు. ప్రజలు బిఆర్ఎస్ ను ప్రతి పక్షంలో కూర్చోబెట్టారు..రాష్ట్రంలో బిజెపి మరింత ప్రమాదకరమైన పార్టీ … కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీల పైన బిఆర్ఎస్ పోరాడాలన్నారు.

ప్రతి జిల్లాలో BRSV సదస్సు పెట్టుకోవాలి…. కమిటీలు వేసుకోవాలి..నా కంటే అద్భుతంగా మాట్లాడే నాయకులు BRSV లో ఉన్నారు అన్నారు. మీడియా ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందన్నారు. ప్రభుత్వం పై బిఆర్ఎస్ పోరాడుతుంటే ఒక్క మీడియా చూపించడం లేదు..అందుకే సోషల్ మీడియాలో మనం యాక్టివ్ గా ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కాలేజీలో BRSV జెండా ఉండాలి , బ్యానర్ ఉండాలి… ఆ విధంగా విద్యార్థులు పోరాటం చెయ్యాలి… డి లిమిటేషన్ జరిగే అవకాశం ఉంది, అప్పుడు విద్యార్థి ఉద్యమాల నుంచి వారికి భవిష్యత్తు ఉంటుందన్నారు.

Also Read:KTR: పోరాటం బీఆర్ఎస్‌కు కొత్త కాదు

పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడి దాడులు జరిగినాయి ..ఎటువంటి సమాచారం బయటకు రాలే…బిజెపి, కాంగ్రెస్ తోడుదొంగలు అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లో గెలుస్తున్నాం ధీమానే మనల్ని కొంప ముంచింది… మేము అంతే ధీమాలో ఉండడంతో ఓడిపోయాము..చిన్న చిన్న పొరపాట్లు చేశాం,వాటిని సవరించుకుందాం, ప్రజలకు దగ్గర అవుదాం విద్యార్ది నాయకులదే భవిష్యత్…బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ దో కాదు మన అందరిదీ అన్నారు.

- Advertisement -