క్రాప్ లోన్ కింద కల్యాణలక్ష్మి నగదును జమ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . ఆడబిడ్డ పెళ్లి చెయ్యడం కష్టం కావొద్దని.. కేసీఆర్ తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని.. వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదా? అంటూ మండిపడ్డారు.
వచ్చిన కల్యాణలక్ష్మి లక్ష రూపాయలలో 60 వేలు బ్యాంకుకి….40 వేలు లబ్ధిదారునికా? అని ప్రశ్నించారు. నువ్వు నడిపేది ప్రభుత్వమా? రికవరీ ఏజెన్సీనా? అందరికీ రెండు లక్షల పంట రుణ మాఫీ చేశామని బాకాలు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి.. సోంబాయి కన్నీటికి కారణం ఎవరు అని! తనకు రావాల్సిన కల్యాణలక్ష్మి డబ్బులులో 60 వేలు ఎందుకు గుంజుకున్నారు అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ఆడబిడ్డ పెళ్లి చెయ్యడం కష్టం కావొద్దని…
కేసీఆర్ గారు తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని…
వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదా?వచ్చిన కల్యాణలక్ష్మి లక్ష రూపాయలలో 60 వేలు బ్యాంకుకి….40 వేలు లబ్ధిదారునికా?
నువ్వు నడిపేది ప్రభుత్వమా? రికవరీ ఏజెన్సీనా?
అందరికీ రెండు… pic.twitter.com/G7ra2f96Lc
— KTR (@KTRBRS) January 25, 2025
Also Read:ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉండాలి: చంద్రబాబు