సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. . భాయ్, భాయ్ అని వందల, వేల కోట్లు పంచుకున్న ముఖ్యమంత్రి.. అదానీ వ్యతిరేక రాలీ తీస్తున్నాడంట అని అన్నారు. నవ్వి పోదురు నాకేటి సిగ్గు అని.. రేవంత్ రెడ్డిని చూసే రాసుంటారని వ్యాఖ్యానించారు. దొంగే దొంగ అనడం నేడు కామన్ అయిపోయిందని చెప్పారు.
అదానీ ఆర్థిక వ్యవహారాలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించడంపై సెటైర్ వేశారు కేటీఆర్. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా.. అదానీకి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్ రెడ్డి.. నేడు అదానీకి వ్యతిరేక ర్యాలీ ని తీయాలని అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
జైపూర్‌లో సరిగ్గా అతిథి మర్యాదలు జరగలేదోనో.. ఢిల్లీలో అపాయింట్మెంట్ దక్కలేదనో.. మొత్తానికి కొత్త నాటకానికి శ్రీకారం చుట్టాడు మన చిట్టినాయుడు అని కేటీఆర్ విమర్శించారు.
Also Read:ఏడాదికి రెండు ఉచిత చీరల పంపిణీ: సీఎం రేవంత్