KTR: రేవంత్ చెప్పేవన్ని అబద్దాలే

2
- Advertisement -

20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన వాంకిడి గ్రామానికి చెందిన విద్యార్థి శైలజ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గురుకులాల్లో చనిపోయిన 48 మంది విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వమే తల్లితండ్రి అయి చూసుకుంటుందని పిల్లల తల్లితండ్రులు గురుకులాలకు పంపిస్తే… 48 మంది పేద పిల్లలను పొట్టన బెట్టుకున్నారు అన్నారు. ఇవి మామూలు మరణాలు కాదు. ప్రభుత్వం చేయించిన హత్యలుగానే భావిస్తున్నాం అన్నారు.

ఎల్లారెడ్డిపేట్‌లో ఓ విద్యార్థి గురుకుల పాఠశాలలో చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే ఆ తల్లితండ్రులు తమలాంటి కడపుకోత వేరే వారికి రాకుండా పోరాడాలని కోరారు అన్నారు. మేము ఆనాటి నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ… గురుకులాల విద్యార్థుల అంశాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాం అన్నారు. కానీ ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు. ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదు అన్నారు.

ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయం. ఆ కుటుంబాల తరఫున శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం… కష్టాలు వచ్చాయని పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవద్దు. నిబ్బరంగా ఉండండన్నారు. ముఖ్యమంత్రి నిన్న అదానీ అంశానికి సంబంధించి మాట్లాడిన కారణంగా మాట్లాడాల్సి వస్తోందని… రేవంత్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్ అంతా ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిసృహతో కనిపించిందన్నారు.

Also Read:Harishrao:వాంకిడి ఘటన సిగ్గుచేటు

రాహుల్ గాంధీతో తిట్లు పడిన తర్వాత నేను వెనక్కి తగ్గాల్సి వస్తుందన్న బాధతో నన్ను కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టాడు… రేవంత్ రెడ్డికి ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కావాల్సినంత దోపీడి జరుగుతుంది. ఇంకా ఎందుకు మమ్మల్ని తిడుతున్నాడో అర్థం కావటం లేదు అన్నారు. చిట్టినాయుడును చిప్ దొబ్బినట్లు అనిపించింది…. మేము అదానీకి ప్రాజెక్టులు ఇచ్చామంటాడు. ఎంపీగా కూడా పనిచేసిన ఈయన జాతీయ రహదారుల ప్రాజెక్టులు మేము ఇచ్చామంటాడు అన్నారు.

ప్రజలను తక్కువ అంచనా వేస్తూ వాళ్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ఇంత తప్పుడు ప్రచారం చేస్తున్నాడు… నువ్వు చెప్పే వాటిని ప్రజలు నమ్మరు. మీడియా ఎవ్వరూ కూడా నమ్మరు అన్నారు. రక్షణ శాఖకు ఇచ్చిన ప్రాజెక్టులు మేము ఇచ్చామంటాడు. రక్షణ శాఖ మా చేతిలో ఉంటుందా? మరీ రాజ్ నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నట్లు?, విద్యుత్ ప్రాజెక్ట్ కూడా కేంద్రం ఇచ్చిందే. ఇంత తెలివితక్కువగా మాట్లాడితే ఏం అనుకోవాలి అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన చెప్పే అబద్ధాలను మీడియా మిత్రులు కూడా ప్రశ్నించాలి… డ్రైపోర్ట్ కూడా కేంద్ర, రాష్ట్రానికి సంబంధించిన అంశం. కేంద్రం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కూడా మేము ఎవరికీ ఇవ్వలేదు. కానీ ఇచ్చినట్లు చూపించారు అన్నారు.

- Advertisement -