రేవంత్ రెడ్డి అబద్దాల ముఖ్యమంత్రి అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో వర్షాపాతంపై సీఎం రేవంత్ మాట్లాడిన మాటలు సత్యదూరం అని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా మండిపడ్డారు. నీటి సమస్యలు తీర్చే సామర్ధ్యం లేక.. లోటు వర్షపాతమంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
అబద్ధాలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సత్యదూరమైన మాటలు మాట్లాడుతుందన్నారు. కాంగ్రెస్ నేతల తీరును తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందన్నారు. భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం రాష్ట్రంలో నమోదైందని తెలిపారు. రైతు సమస్యలు తీర్చడం మాట అటుంచి, తెలంగాణ రైతాంగానికి మూడు నెలల్లోనే స్కాంగ్రెస్ చేతగానితనం పూర్తిగా అర్థమయ్యిందని ఎద్దేవా చేశారు.
IMD లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణానికంటే 14% ఎక్కువ వర్షపాతం (excess rainfall) తెలంగాణలో నమోదు అయ్యింది.
నీటి సమస్యలని తీర్చే చేవలేక, చేతకాక .. లోటు వర్షపాతం (deficit rainfall) అని మాట్లాడడం విడ్డూరం!
అబద్ధాలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్,… pic.twitter.com/JEemdDqmFe
— KTR (@KTRBRS) March 7, 2024