గాంధీ కుటుంబానికి ఇస్తానన్న రూ.1000 కోట్లు నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొమ్మా రేవంత్ రెడ్డి? చెప్పాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర రూ.1000 కోట్లు ఉన్నాయంట…రేవంత్ రెడ్డి ఇవ్వడానికే రూ.1000 కోట్లు ఉంటే, మరి ఆయన ఎన్నికోట్లు దోచుకొని దాచుకున్నాడో? చెప్పాలన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్‌లో రైతుబంధు పడేది.. ఇప్పుడు మార్చి వస్తున్నా రైతుబంధు ఇవ్వడం లేదు…రైతులకు యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు, రైతుల దగ్గర పంటలు కొనే సోయి లేదు.. కానీ గాంధీ కుటుంబానికి రూ.1000 కోట్లు ఇస్తాడంట అని ఎద్దేవా చేశారు.
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలను వెలుగులోకి తెచ్చిన సోషల్ మీడియా వారియర్స్‌కి, మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు…క్వాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వెదవ కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మీద కేసు పెట్టారు.. ఆమె ఏం తప్పు చేసిందని కేసు పెట్టారు?..అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టాలి.. మా నాయకుల మీద కాదు అన్నారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు మూల రాజిరెడ్డిని మరో ఆరుగురు బీఆర్ఎస్ నేతలను పోలీసులను ఏదో అన్నారని కారణం చూపించి అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలీసులను బూతులు తిట్టి, బట్టలూడదీసి కొడతానని అన్నాడు.. పోలీసులను అన్ని మాటలన్నా జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోలేదు..బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులను యూస్లెస్ ఫెలోస్ అని తిడితే కేసులు ఉండవు…క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తుకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చినా, అక్రమంగా మున్సిపాలిటీని దక్కించుకోవాలని మంత్రి వివేక్ ఇలా మా నాయకులపై కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు అన్నారు.
ఒక్కో కౌన్సిలర్‌కు రూ.3 కోట్లు ఆఫర్ చేసినా, నిజాయితీ గల బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రలోభాలకు లొంగలేదు…జనగామలో మా మహిళా కౌన్సిలర్ చేయి పట్టుకొని కాంగ్రెస్ కౌన్సిలర్ లాగాడు..ఇంత లేకి రాజకీయం, దిగజారుడు రాజకీయం కాంగ్రెస్ చేస్తుంది అన్నారు.

