కేసీఆర్, టీఆర్‌ఎస్‌ను దూషిస్తే ఊరుకోం.. కేటీఆర్‌ హెచ్చరిక..

54
ktr on bjp
- Advertisement -

టీఆర్‌ఎస్ నాయకులు కొత్త-పాత నీరు లెక్క కలిసి పనిచేయాలని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. కల్వకుర్తి నుండి పలువురు నేతలు ఇతర పార్టీల నుండి మంత్రి కేటీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికి కేటీఆర్‌ గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. కల్వకుర్తిని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని, కల్వకుర్తికి నీళ్లు ఇప్పించే భాద్యత నేను తీసుకుంటా అని హామీ ఇచ్చారు. అలాగే కొత్త పెన్షన్స్, కార్డుల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో 2వందలు పెన్షన్స్ ఇచ్చి ఇంద్రుడు, చంద్రుడు అని గొప్పలు చెప్పుకున్నారు. నీళ్లు, కరెంట్ గురించి కాంగ్రెస్ నాయకులు ఆనాడు ఊర్లలో తిరగడానికి భయపడే వాళ్ళుని కేటీఆర్‌ విమర్శించారు. ప్రజల్లో కేసీఆర్ కు ఉన్న అండ చూసి కాంగ్రెస్, బీజేపీ లు ఓర్వలేకపోతున్నాయి. ఇగ బీజేపీ నాయకులైతే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.

కేంద్ర బీజేపీ నేతలు హైదరాబాద్‌కులో తిరుగుతారట.. ఇగ రేపటి నుంచి మూడు రోజులు బీజేపీ అబద్దాల దుకాణం పెడుతున్నారు. బీజేపీ కేంద్ర నాయకులారా హైదరాబాద్‌లో ఏదో పీకేస్తాం అంటున్నారు. హైదరాబాద్ బిర్యానీ తిని, ఇరానీ చాయ్ తాగండి అని కేటీఆర్ ఎద్దేవ చేశారు. బీజేపీ జాతీయ శిపాయి నాయకులు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతారట!.. తెలంగాణ అభివృద్ధి అంటే ఏంటో గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రాల నాయకులకు చూపించండి అని అన్నారు.

రైతు బంధు నిధులు, రైతు వేదికలు, రైతు భీమా వంటిని వాళ్లకు చెప్పండి. బీజేపీ నాయకులకు ఇంటింటి ముందు ఉన్న నల్లాలు, హరితహారం చెట్లు చూపించండి. డంప్ యాడ్లు, వైకుంఠ దామాలు, కల్యాణ లక్ష్మీ పథకాలు చూపించండి అని కేటీఆర్‌ సూచించారు. టూరిస్టులు వస్తారు పోతారు, లొల్లి పెడతారు!.. బీజేపీ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. బీజేపీ నాయకులకు ఒకటో రెండో విద్యలు తెలుసు అంతే!.. మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది ఏంటో ప్రజలు అడగాలి అని కేటీఆర్ కోరారు. బీజేపీకి హిందూస్తాన్- పాకిస్తాన్, మతపరమైన లొల్లులు పెట్టించుడు తప్ప వేరే తెల్వదు మండిపడ్డారు. బీజేపీ నాయకులు హైదరాబాద్ వచ్చి కేసీఆర్, టీఆర్‌ఎస్ ను దూషిస్తే ఉరుకోమని హెచ్చరించారు. దేశంలో నిజమైన దొర ఎవరైనా ఉన్నారు అంటే- అది మోడీ మాత్రమే అని ఫైర్‌ అయ్యారు. 8 ఏళ్లలోని మోడీ ప్రభుత్వ పాలనలో నియంతలాగా 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన దొర మోడీ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ఓపికను అసమర్ధత అనుకోవద్దు ప్రతిపక్షలకు వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌.

- Advertisement -