రాష్ట్ర అప్పులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఉద్దేశపూర్తంగా తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు సభా హక్కుల ఉల్లంఘటన నోటీసు ఇస్తున్నామని అన్నారు.
2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ.3,89,673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించింది. అప్పులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఎక్స్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు.
We will be moving a privilege motion against the Congress Govt for its repeated attempts to mislead the legislature & the people of Telangana by stating that the total state debt is 7 lakh crore where as RBI report exposed their lies stating that the debt is only 3.89 lakh crore… pic.twitter.com/Of7N3Yk0I1
— KTR (@KTRBRS) December 16, 2024
Also Read:ఘనంగా హక్కు ఇనిషేటివ్ ‘మన హక్కు హైదరాబాద్’