కేటీఆర్…మెచ్చిన ఫోటో..!

418
ktr
- Advertisement -

కరోనాతో ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తోంది. ఇక భారత్‌లో ఇప్పటికే ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించగా దానిని 2 వారాల పాటు పొడగించనున్నట్లు సమాచారం. కరోనా కట్టడికి దేశమంతా లాక్ డౌన్, సామాజిక దూరం పాటిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేశారు. తన మనసుకు నచ్చిన ఫోటో ఇది అంటూ ఓ షాపుకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు అక్కడ గీసిన బాక్సుల్లో నిల్చున్నారు. వీరంతా సామాజిక దూరం పాటిస్తూ నిలుచోగా అందరిని తెగ ఆకట్టుకుంటోంది.

దీంతో ఆ ఫోటోను ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్ ఈ చిన్నారులు పెద్దలకు సామాజిక దూరం గురించి నేర్పిస్తున్నారు..ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి అని పేర్కొన్నారు.

- Advertisement -