సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్

15
- Advertisement -

సింగపూర్‌ పార్లమెంట్‌లో రెండు అబద్ధాలు చెప్పిన ఎంపీకి 14వేల డాలర్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్.. కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పుల గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి, నాలుగు వేల పింఛన్లు అని, మహిళలకు రూ.2500 అని.. ఇలా 420 అబద్ధాలు చెప్పిన ముసలి నక్క కాంగ్రెస్‌ పార్టీకి, రేవంత్‌ రెడ్డికి4.20 లక్ష కోట్ల జరిమా వేసిన తప్పులేదని విమర్శించారు.

పార్లమెంటరీ కమిటీ ముందు అబద్ధాలు చెప్పినందుకు భారత సంతతికి చెందిన సింగపూర్‌ ఎంపీ ప్రీతమ్‌ సింగ్‌ (48)కి అక్కడి కోర్టు జరిమానా విధించింది.

 

Also Read:వీరమల్లు రిలీజ్ డేట్‌పై క్లారిటీ!

- Advertisement -