KTR:బీజేపీ నేతల అజ్ఞానంపై సెటైర్

28
- Advertisement -

బీజేపీ నేతల అజ్ఞానంపై సెటైర్ వేశారు మాజీ మంత్రి కేటీఆర్. సుభాష్ చంద్ర‌బోస్, మ‌హాత్మా గాంధీ మ‌న దేశ ప్ర‌ధానుల‌ని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ట్వీట్ చేసిన కేటీఆర్…బీజేపీ నేతలకు మతి భ్రమించిందన్నారు.

ప్ర‌తిప‌క్షాల‌ను ల‌క్ష్యంగా చేసుకున్న‌ బీజేపీ నాయ‌కులకు మ‌తిమ‌రుపు ఎక్కువై పోయిందన్నారు. అస‌లు బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావ‌డం లేదని…. నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతూ అడ్డంగా బుక్క‌వుతున్నారన్నారు.

నార్త్‌కు చెందిన ఓ బీజేపీ అభ్య‌ర్థేమో సుభాష్ చంద్రబోస్ మ‌న దేశ ప్ర‌థ‌మ ప్ర‌ధాని అని అంటారు. ద‌క్షిణాదికి చెందిన మ‌రో బీజేపీ నాయ‌కుడేమో మ‌హాత్మాగాంధీ మ‌న దేశ ప్ర‌ధాని అని చెబుతారు… ఇలాంటి వారంతా ఎక్క‌డ డిగ్రీలు చేశార‌ని ప్ర‌శ్నించారు.

Also Read:ఐస్ క్రీమ్ తింటున్నారా..జాగ్రత్త!

- Advertisement -