కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గలీజు రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి అడ్డుపడుతూ అభివృద్ధిని అడ్డుకుంటుందోని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ మంత్రి కేటీఆర్ సనత్‌నగర్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమీర్‌పేటలో రూ. 25 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు జరగనున్నాయని తెలిపారు. ఎస్‌ఆర్‌నగర్‌లో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని. రూ.3.28 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం పనులు జరగనున్నాయని తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ గుడి వద్ద రూ. మూడు కోట్లతో చేపట్టిన పార్కింగ్ పనులకు శంకస్థాపన చేశామని, పటేల్‌నగర్ శ్మశాన వాటికలో రూ.2 కోట్లతో చేపట్టనున్న పనులు ప్రారంభించామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
రాష్ట్రంలో 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగింది. 55 ఏళ్లు ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు మూడేళ్ల టీఆర్‌ఎస్ పాలనను తప్పు పడుతున్నారు. టీఆర్‌ఎస్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయరు. తమది పేదల ప్రభుత్వంమని…. పేదల ఆకలి, ఆత్మగౌరవం, ఆలోచన అర్థం చేసుకున్న ప్రభుత్వమన్నారు. సీఎం చల్లగుండాలని దీవిస్తున్నారని… పండుగపూట నాలుగు మంచి మాటలు చెబుతున్నారంటే… అది చాలు అని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల చిరునవ్వుల కోసమే తాము పనిచేస్తున్నామన్నారు. రోడ్లు త్వరలో బాగు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా… కచ్చితంగా అభివృద్ధి చేసి తీరతామన్నారు. తమ బాసులు బన్సీలాల్ పేట్ గల్లీల్లో ఉన్నారని.. ఢిల్లీలో లేరని ఘాటుగా విమర్శించారు. రానున్న దీపావళి నాటికి ఎన్ని కమ్యునిటీ హాళ్లు వీలైతే అన్ని కడతామన్నారు కేటీఆర్.